కల్మషం లేని వ్యక్తి విజయబాపినీడు: ప్రముఖ నటుడు నాగబాబు

కల్మషం లేని వ్యక్తి విజయబాపినీడు: ప్రముఖ నటుడు నాగబాబు

ప్రముఖ దర్శకుడు విజయబాపినీడు మృతిపై ప్రముఖ సినీ నటుడు నాగబాబు తన సంతాపం వ్యక్తం చేశారు. ఓ వీడియో పోస్ట్ లో ఆయన మాట్లాడుతూ, విజయబాపినీడు చాలా గొప్ప సినిమాలు తీశారని, వీటన్నింటికంటే ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పదని అన్నారు. విజయబాపినీడుకి తమ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కొంత కాలం క్రితమైతే విజయబాపినీడుని తాను కలవని రోజు ఉండేది కాదని, తనకు ఉన్న పని ఒత్తిళ్ల వల్ల ఈ మధ్యకాలంలో ఆయన్ని ఎక్కువగా కలవలేకపోయినట్టు చెప్పారు. కల్మషం లేని వ్యక్తి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి విజయబాపినీడు అని, ఆయన చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేమని కొనియాడారు. ఆయన మరణవార్త వినగానే చాలా బాధపడ్డానని, చింతిస్తున్నానని, ఆయన కుటుంబానికి తన సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.