కర్ణాటకలో మళ్లీ ‘ఆపరేషన్ కమల్’.. సిద్ధరామయ్య సంచలన ఆరోపణ

కర్ణాటకలో మళ్లీ ‘ఆపరేషన్ కమల్’.. సిద్ధరామయ్య సంచలన ఆరోపణ

లోక్‌సభ ఎన్నికల తర్వాత ‘ఆపరేషన్ కమల్ 2.ఒ’
ఈసారి కేంద్రంలో బీజేపీకి అధికారం కష్టమే
కాంగ్రెస్-జేడీఎస్ కూటమి స్థిరంగానే ఉంది
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మళ్లీ ‘ఆపరేషన్ కమల్’ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ‘ఆపరేషన్ కమల్ 2.ఒ’ను ప్రారంభించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి దక్షిణాదిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న బీజేపీ కలలు సఫలమవుతాయని తాము భావించడం లేదన్నారు.

ఈసారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి అతి తక్కువ సీట్లు వస్తాయని, కాబట్టి ఈసారి కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనన్నారు. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో బీజేపీ 102 సీట్లు గెలుచుకుందని, ఈసారి అన్ని సీట్లు రావడం కష్టమేనని సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో మోదీ హవా లేదన్నారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం స్థిరంగానే ఉందని, ప్రభుత్వం పడిపోతుందన్న భయం తమకు లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

Leave a Reply