ఓటుకు నోటు కేసులో కొనసాగుతున్నఈడీ విచారణ

ఓటుకు నోటు కేసులో కొనసాగుతున్నఈడీ విచారణ

ఓటుకు నోటు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ ముందు కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి, అతని కుమారుడు కీర్తన్ రెడ్డి హాజరయ్యారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాశేఖర్ ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు మిగిలిన రూ.4.5 కోట్లకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంకు స్టేట్ మెంట్స్, ఏసీబీ ఇచ్చిన ఆధారాలను వారి ముందు ఉంచినట్టు తెలుస్తోంది. కాగా, సుమారు ఆరు గంటలకు పైగా నరేందర్ రెడ్డిని, కీర్తన్ రెడ్డిని విచారణ కొనసాగుతోంది. వీళ్లిద్దరినీ వేర్వేరుగా అధికారులు విచారణ చేస్తున్నారు. ఏసీబీ చార్జిషీట్ ఆధారంగా నిందితులందరినీ విచారించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.