ఏపీలో సీబీఐకి గ్రీన్ సిగ్నల్.. జీవో జారీచేసిన జగన్ ప్రభుత్వం!

  • గతేడాది సీబీఐకి సమ్మతి ఉత్తర్వుల రద్దు
  • సీబీఐని కక్షసాధింపు కోసం వాడుతున్నారని వ్యాఖ్య
  • కొత్తగా సమ్మతి ఉత్తర్వులు ఇచ్చిన జగన్ ప్రభుత్వం

సీబీఐలో అంతర్గత కుమ్ములాటలతో పాటు, రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసం దీనిని ప్రయోగిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబు సీబీఐకి ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను రద్దుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.

సీబీఐ రాష్ట్రంలో కేసులను విచారించేందుకు సమ్మతి ఉత్తర్వులను జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఏపీలో పలు కేసులను సీబీఐ విచారించేందుకు మార్గం సుగమమయింది. 2018, నవంబర్ 8న సీబీఐకి సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసింది.

Leave a Reply