nagababu latest comments, bala krishna, lepakshi utsavalu,mla balayya

ఎమ్మెల్యేగా ఉండి డిక్టేటర్ గా మాట్లాడుతున్నారని నాగబాబు విసుర్లు

హీరో బాలకృష్ణను లక్ష్యంగా చేసుకుని నటుడు నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు టాలీవుడ్ లో కాక రేపుతున్నాయి. గతంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలను చూపిస్తూ, వాటిపై తన కౌంటర్ ను వీడియో రూపంలో విడుదల చేస్తున్న నాగబాబు, నాలుగో కామెంట్ ను విడుదల చేశారు.

లేపాక్షి ఉత్సవాలు జరుగుతున్న వేళ, చిరంజీవిని పిలిచారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు, “లేదండి, నేనెవడినీ నెత్తిన ఎక్కించుకొని కూర్చోబెట్టుకోను. నా కష్టార్జితం. ఎవరిని పిలవాలో వాళ్లని పిలుస్తా” అని బాలకృష్ణ వ్యాఖ్యానించిన బ్రేకింగ్ బోర్డులు చూపించిన నాగబాబు, “చూశారు కదా ఈ కామెంట్. మీరు లేపాక్షి ఉత్సవాలకు సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో మీరేం మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లేపాక్షి ఉత్సవాల్లో, చిరంజీవిని పిలిచారా? అని అడిగినప్పుడు, ‘నేను చిరంజీవిని పిలవలేదు’ అని సింపుల్ గా సమాధానం ఇవ్వవచ్చు. పిలవాలనుకోవడం లేదని చెప్పుకోవచ్చు.

అలాంటిది, మాకున్న గ్లామర్ చాలు, ఇంకొకడిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోను అన్నారు. చిరంజీవి మిమ్మల్ని నెత్తినపెట్టుకోమని మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? మావాళ్లు ఎవరైనా చెప్పారా? మా ఫ్యాన్స్ ఎవరైనా చెప్పారా? మీ కామెంట్ ఏంటి? నోటి దురుసు ఏంటి? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? అలా ఎవరినీ నెత్తిన పెట్టుకోమని అంటే… ఉంచుకోండి. మీ గ్లామర్ మీరు ఉంచుకోండి. మీ పేరు మీరు ఉంచుకోండి. చిరంజీవిగారిని పిలవలేదా? అంటే పిలవలేదని చెప్పండి.

నెత్తిన పెట్టుకుని ఊరేగాల్సిన అవసరం నాకు లేదు అన్నారేంటి? ఒక డిక్టేటర్‌లా ప్రవర్తిస్తానని అనడం ఏంటి? ప్రవర్తించండి? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక డిక్టేటర్‌లా మాట్లాడుతున్నారు కదా? మీరు మాట్లాడేవి చూస్తూనే ఉన్నాము. ఎందుకులే అని సంయమనం పాటిస్తూనే ఉన్నాము. కంట్రోల్‌ లో ఉంటున్నాం. అయినా మీరు మాత్రం ఎప్పుడూ కంట్రోల్‌ లో ఉండటం లేదు. వ్యక్తిగతమైన లైఫ్ జోలికి వస్తున్నారు. అయినా సరే మేము సైలెంట్‌ గానే ఉంటున్నాం. నోట్ దిస్” అంటూ నాగబాబు తన తాజా కామెంట్ ను వదిలారు.
Tags: nagababu latest comments, bala krishna, lepakshi utsavalu,mla balayya