ఎట్టకేలకు వచ్చేశారు... ట్విట్టర్ లోకి మాయావతికి స్వాగతం పలికిన తేజస్వి యాదవ్!

ఎట్టకేలకు వచ్చేశారు… ట్విట్టర్ లోకి మాయావతికి స్వాగతం పలికిన తేజస్వి యాదవ్!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తన కార్యకర్తలు, పార్టీ నేతలకు మరింతగా దగ్గర కావాలన్న ఆలోచనతో సామాజిక మాధ్యమం ట్విట్టర్ లో తన ఖాతాను మాయావతి ప్రారంభించారు. ఆమె ట్విట్టర్ ఖాతా ‘@sushrimmayawati’ కాగా, ఆమెకు స్వాగతం పలుకుతూ తేజస్వీ యాదవ్ ఓ ట్వీట్ ను ఉంచారు.

“ఎట్టకేలకు మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నాను. సంతోషంగా ఉంది. ట్విట్టర్ లో చేరాలని జనవరి 13న నేను లక్నోలో చేసిన విజ్ఞప్తిని మన్నించినందుకు ధన్యవాదాలు.” అని వ్యాఖ్యానించారు. ఆమె ట్విట్టర్ ఖాతా ఇప్పటికే వెరిఫై ప్రక్రియను పూర్తి చేసుకోగా, నిమిషాల వ్యవధిలో 5,500 మంది ఫాలోవర్లు చేరిపోయారు. ఈ సంఖ్య భారీగా పెరిగిపోతోంది.