నిజామాబాద్‌లో బీజేపీ విజయోత్సవ సభ బీజేపీ విజయం వెనక 30 ఏళ్ల కష్టం ఉందన్న లక్ష్మణ్ టీఆర్ఎస్‌కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారన్న బీజేపీ చీఫ్ తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలు కైవసం చేసుకుని అధికార టీఆర్ఎస్‌కు షాకిచ్చింది. ఈ గెలుపును

ఎంఐఎంతో చేతులు కలిపినందుకు తగిన శాస్తే జరిగింది: టీఆర్ఎస్‌పై లక్ష్మణ్ ఫైర్

నిజామాబాద్‌లో బీజేపీ విజయోత్సవ సభ
బీజేపీ విజయం వెనక 30 ఏళ్ల కష్టం ఉందన్న లక్ష్మణ్
టీఆర్ఎస్‌కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారన్న బీజేపీ చీఫ్
తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలు కైవసం చేసుకుని అధికార టీఆర్ఎస్‌కు షాకిచ్చింది. ఈ గెలుపును సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో సోమవారం నిజామాబాద్‌లో ఆ పార్టీ నేతలు విజయోత్సవ సభ నిర్వహించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఆ పార్టీ తెలంగాణ చీఫ్ డాక్టర్ కె.లక్ష్మణ్, యెండల లక్ష్మీనారాయణ తదితరులు విజయోత్సవ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడం వెనక 30 ఏళ్ల కృషి, త్యాగం ఉన్నాయన్నారు. నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత గెలుపు కోసం ఆ పార్టీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. పసుపు, ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత చేతులెత్తేశారని విమర్శించారు. ఎంఐఎంతో చేతులు కలిపినందుకు టీఆర్ఎస్‌కు ప్రజలు తగిన శాస్తి చేశారని, కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు.

Leave a Reply