అసెంబ్లీ లాబీల్లో లోకేశ్: ఉల్లాసంగా...ఉత్సాహంగా పలువురికి పలకరింపు

అసెంబ్లీ లాబీల్లో లోకేశ్: ఉల్లాసంగా…ఉత్సాహంగా పలువురికి పలకరింపు

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇదే మొదటిసారి రావడం
ఉమ్మడి సభల సమావేశం జరగనుండడంతో హాజరు
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కరచాలనం
అసెంబ్లీ లాబీల్లో ఈరోజు మాజీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ స్పెషల్‌ అట్రాక్షన్‌ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో కనిపించారు. ఎమ్మెల్సీ అయిన లోకేశ్ మంగళగిరి నుంచి ఈ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఈరోజు ఉమ్మడి సభల నుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తుండడంతో ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు స్వపార్టీ నేతలు, అధికార పక్ష నేతలతో కరచాలనం చేశారు. మంత్రులు అంజద్‌బాషా, ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డిలను అభినందించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును పలకరించారు. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో కరచాలనం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు.

Leave a Reply