అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు... నియమ నిబంధనలు ఇవే!

అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు… నియమ నిబంధనలు ఇవే!

వార్షిక ఆదాయం రూ. 8 లక్షలకు మించరాదు
5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉండాలి
నివాసం వెయ్యి చ.అడుగుల కంటే తక్కువ ఉండాలి
అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ మోదీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర లభించింది. దీనికి సబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును రేపు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.

10 శాతం రిజర్వేషన్లు పొందే కుటుంబాలకు నిబంధనలు ఇవే:
సంవత్సర ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
వ్యవసాయ భూమి 5 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి.
సొంత ఇల్లు 1,000 చదరపు అడుగుల కంటే తక్కువలో ఉండాలి.
మునిసిపాలిటీ పరిధిలో వుండే నివాస స్థలం అయితే కనుక 109 చదరపు గజాల లోపులో ఉండాలి.
మున్సిపాలిటీయేతర పరిధిలో అయితే కనుక 200 చదరపు గజాల లోపులో ఉండాలి.