అకీరాలో ఉన్నది పవన్ కల్యాణ్ రక్తం: రేణు దేశాయ్

అకీరాలో ఉన్నది పవన్ కల్యాణ్ రక్తం: రేణు దేశాయ్

అకీరా సినిమాల్లోకి వచ్చే అవకాశం
అతని రక్తంలోనే నటన ఉంది
అయితే, ముందు చదువు పూర్తి చేయాలి
తన కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలిపారు. అకీరాలో ఉన్నది పవన్ రక్తమని… ఆ రక్తంలోనే నటన ఉందని చెప్పారు. అకీరా సినిమాల్లోకి రావడంపై తాను అభ్యంతరం చెప్పనని… అయితే ముందు తన చదువును పూర్తి చేయాలని తెలిపారు. అకీరా వయసు 14 సంవత్సరాలని… హీరో అయ్యే టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తాడని చెప్పారు. అకీరా పెదనాన్న చిరంజీవి, అన్నయ్య రామ్ చరణ్ ల ప్రభావం కూడా అకీరాపై ఉంటుందని తెలిపారు.